Logo
 
  Home     |    న్యూస్     |    ఫీచర్స్     |    సినిమా     |    బిజినెస్     |    స్పోర్ట్స్     |    ఎడిటోరియల్     |    ఎన్నారై     |    లెటర్ టు ఎడిటర్     |      

తెలంగాణ రాష్ట్రం కోసం బీటెక్‌ విద్యార్ధి ఆత్మహత్య


Updated on 31-07-2010 02:30 pm

హైదరాబాద్‌, జూలై 31: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ఇషాంత్‌ రెడ్డి అనే బీటెక్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇషాంత్‌ రెడ్డి వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ పూర్తి చేసి జిఆర్‌ఇకి తయారవుతున్నాడు. అతను మెదక్‌ జిల్లా న్యాలకల్‌ మండలం బసంతపూర్‌కు చెందినవాడు. తల్లిదండ్రులు స్వరూప, ఇంద్రసేనారెడ్డి చేతికి అంది వచ్చిన కొడుకు మరణవార్త విని కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇషాంత్‌ రెడ్డి శుక్రవారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు కారణం తెలియజేస్తూ అతను ఓ సూసైడ్‌ నోట్‌ కూడా రాసిపెట్టాడు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ఓడిపోతే ప్రాణత్యాగం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకుంటున్నాని అతను రాశాడు. మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్‌బాబు, తెలుగుదేశం నాయకులు నాగం జనార్ధన్‌ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవేందర్‌ గౌడ్‌, కాంగ్రెసు నాయకులు జానారెడ్డి, దామోదర్‌ రెడ్డి తెలంగాణ ద్రోహులని అతను రాశాడు. తన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకూడదని, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాలని అతను కోరుకున్నాడు. ఇషాంత్‌ రెడ్డి మృతదేహం వద్దకు పెద్దఎత్తున విద్యార్ధులు చేరుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి తెలంగాణ సాధించుకుందామని విద్యార్ధి నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
Related News
   
 
featuresIndia
All Rights Reserved @ 2010